ఆయుష్మాన్‌భారత్‌ కార్డులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 ఆరోగ్య శ్రీ వంటి సొంత ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టాల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్‌భారత్‌ కార్డులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.



ఆయుష్మాన్‌భారత్‌ కార్డు ఉంటేనే ఉచిత వైద్యం అందుతుందని రాష్ట్రంలో కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ చివరి గడువు అంటూ ఆందోళనకు గురిచేస్తున్నారు. దీంతో చాలా మంది డబ్బుల కోసం ఇంటర్నెట్‌ సెంటర్లు, మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్‌భారత్‌ కలిపి అమలవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా కార్డులు అవసరం లేదు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మి డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని అధికారులు కోరుతున్నారు.



Comments