వ్యాపారస్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షాపులను 24 గంటలు తెరచి ఉంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు 24X7 తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు. ఈ నిబంధన అమలు కోసం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988కు ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే షాపులు, మాల్స్‌లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్‌డ్యూటీలు వారి అనుమతితోనే వేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ
వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్)
వారంలో పనిగంటలు
ఓవర్‌టైమ్ వేజెస్
జాతీయసెలవు దినాల్లో పనిచేసిన సిబ్బందికి పరిహారంగా వేతనం చెల్లింపు
మహిళా ఉద్యోగుల రక్షణా ఏర్పాట్లు
ఉద్యోగుల సమ్మతితోనే నైట్‌డ్యూటీలు వేయాలి
నైట్‌డ్యూటీలు చేసే మహిళా ఉద్యోగులకు రానుపోనూ రవాణా సదుపాయం
24/7 పనిచేసే ప్రతి సంస్థ రూ. 10 వేలు వార్షిక రుసుం చెల్లించాలి
సిబ్బందికి చట్టప్రకారం ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించాలి.
Comments
Post a Comment